Breaking News

గ్రామ పంచాయతీ కార్మికుల రాస్తారోకో

జూలూరుపాడు,ఆగస్టు,7:ప్రజా కోట

ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పంచాయతీ కార్మికులు మండల కేంద్రంలోని కోత్తగూడెం – ఖమ్మం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. జూలూరుపాడు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారానికి 33వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగులను, కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ జిల్లా కన్వీనర్ ఏదులాపురం గోపాలరావు, సిపిఐ ఎంఎల్ ప్రజాపంద మండల కార్యదర్శి భానోత్ ధర్మ, సిఐటియు మండల నాయకులు వల్లమల చందర్రావు, ఏఐటీయూసీ మండల కన్వీనర్ ఎస్.కె చాంద్ పాషా, ఐఎఫ్టియు మండల కన్వీనర్ రాయల సిద్దు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి పవన్, అధ్యక్షుడు బోడ అభిమిత్ర సిపిఎం పార్టీ మండల నాయకులు గార్లపాటి వెంకటి, ప్రజాపంథానాయకులు కొండే వెంకటేశ్వర్లు, పారుపల్లి బాబురావు, లింగాల వీరభద్రం గ్రామపంచాయతీ కార్మికుల సంఘం మండల అధ్యక్షులు భూక్య ఏరియా, ధారావత్ నాగు, తంబర్ల లక్ష్మి, మల్కం నరసింహారావు, సంజీవరావు తంబర్ల లక్ష్మి కళావతి సునీత గురవమ్మ తదితరులు పాల్గొన్నారు.